ప్రధాన రహదారికి పక్కనే చెత్త దహనం
నాగర్ కర్నూల్ మే 20 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను ప్రధాన రహదారు ల వెంట పారబోసి నిప్పంటించడంతో విష వాయువు వెలువడి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని పట్టణ వాసులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ వెళ్లి చెత్త బండి ద్వారా నిత్యం సేకరిం చే 16టన్నుల చెత్తను విలీన గ్రామపంచాయతీలైన నాగనులు, దేసిటిక్యాల, ఎండబెట్ల ఉ య్యాలవాడ, నల్లవెల్లి రోడ్డు పరిధిలోని ఎర్రగడ్డ కాలనీ ప్రదేశాల్లో రోడ్డుకు ఇరువైపులా పారాబోస్తున్నారని ఆయా కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపార సం స్థలు, మాంసపు దుకాణాలు, కొబ్బరి బోం డాలు, మెడికల్ వేస్టేజ్, ఇతర ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి ప్రధాన ర హదారులకు ఇరువైపులా తారబోస్తున్నారని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడి పొడి చెత్తను వేరు చేయడంతో పాటు ప్రమాదకర ప్లాస్టిక్ ఇతర మెడికల్ వే స్టేజ్ వంటి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వేరు చేయాల్సి ఉంది. కానీ మున్సిపల్ అధికారు ల నిర్లక్ష్యం కారణంగా శ్వాసకోస సంబంధిత వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులు వంటి వి పట్టణ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంత బజార్, ఈ దమ్మ గుడి కాలనీ ప్రదేశంలోని అత్యంత చేరువగా ఉన్న చందాయిపల్లి గ్రామ శివారు లో చెత్తను పారబోయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. బస్ డిపో పరిసరాల్లో ప్రధాన రహదారికి ఆనుకుని చెత్తను బహిరంగంగా దహనం చేయడంతో భారీగా పొ గ వ్యాపించి వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పార బోయడంతో పందులు కుక్కలు మూగజీవాలు వాటిలో తిరగడంతో దుర్గంధం వెద జల్తోందని మండిపడుతున్నారు.
అయినా శానిటేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నా రని పాలకవర్గం కూడా పట్టించుకోకపోవడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఉయ్యాలవాడ, నాగనూల్, నెల్లికొం డ, నల్లవెల్లి గ్రామాల ప్రధాన రహదారుల వెంట చెత్తకు నిప్పంటించడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారిపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసేపు రోడ్డుపై కనిపించే దూరం తగ్గిపోవడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు కళ్ల మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఫలితంగా గాలి కాలుష్యం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం పర్యావరణ నిబంధనల కు విరుద్ధమనిచెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించకుండా బహిరంగంగా దహనం చేయడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా మున్సిప ల్ అధికారులు చెత్త నిర్వహణలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






