13 May, 2026 | 12:53 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

శ్రీ రఘునాథ యూత్ ఆధ్వర్యంలో మహిళల కుంకుమ పూజ కార్యక్రమం

29-09-2025 08:56 AM

అనంతగిరి: మండల కేంద్రంలో  శ్రీ రఘునాథ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు భాగంగా కమిటీ సభ్యులు రఘునాథ యూత్(Sri Raghunatha Youth) ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు తీర్థం వెంకటేష్ వారి చేత కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. కమిటీ వారు పూజకు సంబంధించిన సామాగ్రి అందిస్తూ  మహిళలకు సహకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను శ్రీ రఘునాథ యూత్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతిరోజు రాత్రి బతుకమ్మ పండుగ కార్యక్రమం నిర్వహిస్తూ, దానిలో భాగంగా కోలాటం నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళల అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం శ్రీ రఘునాథ యూత్ ఆధ్వర్యంలో భక్తులందరికీ ఘనంగా నిర్వహించారూ. అన్నదాన కార్యక్రమానికి దాతలుగా బండి నరేష్, గోపి లు గా ఉన్నారు.ఈ దాతలకు  ప్రత్యేకంగా  గ్రామ పెద్దల చేత కమిటీ సభ్యులు శాలువాలు వేయించి చిరు సన్మానం నిర్వహించారు. ఆ దేవి కృప లు ప్రతి ఒక్కరిపై కలుగుతూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.