22 April, 2026 | 1:09 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

అతి పెద్ద భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ సర్కార్!: కేటీఆర్

21-11-2025 01:05 PM

హైదరాబాద్: నగరంలో భారీగా భూకుంభకోణం జరుగుతోందని మాజీమంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆరోపించారు. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో భూ కంభకోణం జరుగుతోందన్నారు. నగరంలో ఉన్న 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములను, రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నాడని కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కేబినెట్ భేటీలో తెరలేపిందని తెలిపారు. హైదరాబాద్‌లో భూములు ఉన్న చోట రేవంత్ రెడ్డి ముఠా వాలిపోతుందని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆలోచనలు మొత్తం భూములపైనే ఉంటుందన్నారు. 

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ పేరిట 9,295 ఎకరాల పారిశ్రామిక భూములను, రేవంత్ రెడ్డి ఏటీఎంగా మార్చుకునే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100శాతం, 200 శాతం ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టామని కేటీఆర్ తెలిపారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి, ఏవీ.రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడా బాబులకు కేవలం 30శాతం ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో మంత్రులు ఆమోదం తెలిపారని ఆరోపించారు. 9,295 ఎకరాల సర్కార్ భూములను తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 30శాతం ప్రభుత్వానికి వస్తే, మిగతా 60శాతం రేవంత్ రెడ్డి దోచుకునే ప్రయత్నంలో ఉన్నాడని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి ఈ భూముల ద్వారా దాదాపు రూ.4 లక్షల కోట్ల నుండి రూ.5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నాడని కేటీఆర్ వెల్లడించారు.