9 April, 2026 | 6:19 PM

Breaking News

బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •   రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •  

బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులపై మండిపడ్డ కేటీఆర్

09-10-2025 09:05 AM

హైదరాబాద్: తనతో పాటు నేతల హౌస్ అరెస్టులపై(House Arrest) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. తక్షణమే బస్సు ఛార్జీల పెంపు వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తామంటే భారీగా పోలీసులను మోహరించారని మండిపడ్డారు. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడానికి ఇంతమంది పోలీసులను పంపారని చెప్పారు.

ఈ ఉత్సాహం హైదరాబాద్ లో నేరాల అదుపులో చూపిస్తే మంచిందని కేటీఆర్ సూచించారు. ఎన్ని రకాల కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటామని హెచ్చరించారు. పోలీసు నిర్భంధాలు తమకు, బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని వివరించారు. బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులు అడ్డంకులు కలిగించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, జవహర్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధమ మేయర్ మేకల కావ్యతో పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.