calender_icon.png 15 February, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులను స్వయం పాలకులుగా చేసిన ఘనత కేసీఆర్ గారిదే

15-02-2026 02:47:48 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తండాల తలరాతను మార్చి, గిరిజనులను స్వయం పాలకులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దే అని గుర్తు చేశారు. గతంలో గిరిజన బిడ్డలకు 4.50 లక్షల ఎకరాల పోడు పట్టాలు అందించి వారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని చెప్పారు. గిరిజన బిడ్డలైన బంజారాల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టేందుకు హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని ⁠బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్, ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.