నాయకుడిగా కేటీఆర్ విఫలం: మంత్రి వివేక్
02-09-2026 | 04:35pm
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయిందని, అంతేకాకుండా నాయకుడిగా కేటీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఓటమి ఫ్రస్టేషన్ లో కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, వెయ్యి రోజుల ప్రజా పాలనపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.






