దమ్మపేటలో కెటిఆర్ జన్మదిన వేడుకలు
24-07-2026 04:50 PM
కేక్ కట్ చేసి నాయకులకు తినిపించిన మాజీ ఎం ఎల్ ఏ మెచ్చా
దమ్మపేట,(విజయ క్రాంతి): రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు.






