23 June, 2026 | 5:09 PM

Breaking News

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   పాతబస్తీలో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు   •   ఆడబిడ్డ పెండ్లికి ఐదువేల ఆర్థిక సహాయం   •   హజ్-2027 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం   •  

హైదరాబాద్ మెట్రోపై రేవంత్ కన్ను..

23-06-2026 03:57 PM

రూ. 30 వేల కోట్ల ఆస్తుల దోపిడీకి కుట్ర

కేటీఆర్ తీవ్ర ధ్వజం

రంగారెడ్డి, జూన్ 23(విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును(Hyderabad Metro Rail Project) వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కొత్త డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (Kalvakuntla Taraka Rama Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయిసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు.​ రూ. 30 వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ స్కెచ్ వేసిందన్నారు. ​దాదాపు 30 వేల కోట్ల రూపాయల విలువైన మెట్రో రైల్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడిందని కేటీఆర్ ఆరోపించారు.

ఈ భారీ ప్రభుత్వ ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు కట్టబెట్టేందుకు ఒక భారీ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు.మెట్రో రైల్ నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టి  అధికారులను బ్లాక్‌మెయిల్ చేసి, వారిని రాష్ట్రం నుంచితరిమేసేందుకు కుట్రలు చేశారు. ఎల్ అండ్ టి కి ఉన్న రూ. 14,000 కోట్ల అప్పు భారాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని  కేటీఆర్ పేర్కొన్నారు.​రేవంత్, కిషన్ రెడ్డిలది 'ఫ్రెండ్లీ మ్యాచ్' ​హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల కాంగ్రెస్, బీజేపీలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలపలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, విస్తరణకు మోకాలొడ్డిన కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు క్షమించరన్నారు. రేవంత్ రెడ్డికి తుగ్లక్, హిట్లర్లే ఆదర్శమని ఆయన ఎద్దేవా చేశారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై నిప్పులు..

​బీఆర్ఎస్ కార్యకర్తల రక్తం, చెమటతో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. తన స్వార్థ ప్రయోజనాలు, అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికే కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి:  గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గానికే రూ. 9,500 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామని, ఆ రోజే స్వయంగా గాంధీ ప్రగతి నివేదిక విడుదల చేశారని గుర్తుచేశారు.

​రెండేళ్లలో ఏం చేశారు?: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాంధీ ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ​కేసీఆర్ సీఎం కావాలని ప్రజల ఎదురుచూపు​రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన చూసి ప్రజలు విసిగిపోయారని కేటీఆర్ అన్నారు. క్యాలెండర్‌లో తేదీలు ఎప్పుడు మారుతాయా, కేసీఆర్ మళ్లీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని తెలంగాణ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో మళ్లీ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.