10 June, 2026 | 4:10 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

కొత్తూరు మున్సిపల్ బడ్జెట్ రూ.36.51 కోట్లు

01-04-2026 12:36 AM

బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, మార్చి 31 (విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.36.51 కోట్లు అంచనా బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. సోమవారం కొత్తూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్  మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు,అధికారులు భాగ్యస్వామ్యంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అన్ని రకాల పనులు,అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్,నాన్ ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో కలిపి మొత్తం రూ .36.51 కోట్లుతో బడ్జెట్ రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్,కౌన్సిలర్లు మాధవి గోపాల్ గౌడ్,చంద్రకళ రాజేందర్ గౌడ్,కోస్గి శ్రీనివాస్,సోమ్లా నాయక్,వీరమోని హేమ దేవేందర్ ముదిరాజ్,కమ్మరి జయమ్మ జనార్దన్ చారి, మాదారం నరసింహ గౌడ్, బ్యాగరి ప్రసన్న లత యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.