కొమురం భీమ్‌కు కోట రాజబాపు ఘన నివాళులు
భూపాలపల్లి/మహదేవపూర్, విజయక్రాంతి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఆదివాసీ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొమురం భీమ్‌ను ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ విగ్రహానికి భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాపు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కోట రాజబాపు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వాభిమానం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన కొమురం భీమ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, యువత, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని కొమురం భీమ్‌కు నివాళులర్పించారు.






