10 April, 2026 | 8:51 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

కొండగట్టు అగ్ని ప్రమాద

02-12-2025 12:57 AM
  1. బాధితులకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే 

కరింనగర్, డిసెంబర్1(విజయక్రాంతి):ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంది ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా కల్పించారు. సోమవారం తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్లో కలిసి కొండగట్టు అగ్ని ప్రమాద ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.

అర్థరాత్రి మంటలు అంటుకొని దుకాణాలు కాలిపోయాయని, దుకాణాలను నమ్ముకొని జీవిస్తున్న వారు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం తరఫున అగ్ని ప్రమాద  బాధితులకు రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు.

పరిహారం అందజేయడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అగ్ని ప్రమాద నివేదికను తయారుచేసి పంపించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పరిహారం మంజూర చేయాలని కోరగానే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలుతెలిపారు.