కోనాయిపల్లి అభ్యర్థి కంకణాల నాగమణి నామినేషన్ దాఖలు
01-12-2025 10:42 PM
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి పిబి గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి కంకణాల నాగమణి రెండో విడతలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను మండల సమీకృత కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయడం జరిగింది. గ్రామ ప్రజల ఆశీస్సులతో బరిలోకి దిగడం జరిగింది. గతంలో గ్రామ అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషించిన కుటుంబంగా ఉండడంతో గ్రామ ప్రజలు మరోసారి అవకాశం కల్పించారని గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.




