ఇందిరమ్మ ఇల్లులను ప్రారంభించిన కొమ్మూరి
జనగామ, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మూల రాములు, బాలగోని శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరు ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు.
ఇల్లు ప్రతి కుటుంబానికి పెద్ద ఆస్తి అని, ఇలాంటి పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కావటి సుధాకర్, మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ గంగం నరసింహారెడ్డి, మార్కెట్ చైర్మన్ భానుక శివరాజ్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ముత్త సాంబరాజు, నీల రాజు, వార్డ్ మెంబర్లు కాసాని గాలయ్య, నీలా కనకరాజు, బండి సాంబరాజు, భాషబోయిన రమేష్, యూత్ అధ్యక్షులు నీల సంపత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






