27 April, 2026 | 3:16 AM

రామప్పను సందర్శించిన విదేశీయులు

27-04-2026 01:29 AM

వెంకటాపూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మండలంలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆదివారం విదేశీయులు సందర్శించారు. కామెరూన్ దేశానికి చెందిన సోనిలీ, ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇవాన్ వెబర్లు వేర్వేరు సమయాల్లో ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రత్యేకతలను వివరించగా, వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించిన విదేశీయులు బోటింగ్ను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో టూరిజం పోలీసులు, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు.