25 April, 2026 | 3:19 AM

కోహ్లీ కమాల్

25-04-2026 01:26 AM

* డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్‌లో చెలరేగిపోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయిన వేళ, పడిక్కల్ మెరుపులు మెరిపించిన వేళ 206 పరుగుల టార్గెట్ చిన్నబోయింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అంతే కాదు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

  1. బెంగుళూర్ ఘన విజయం 
  2. పడిక్కల్ మెరుపులు
  3. సాయి సుదర్శన్ సెంచరీ వృథా

బెంగుళూరు, ఏప్రిల్ 24 : టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తొలుత బౌ లింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్లు సా యి సుదర్శన్, శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 76 బంతుల్లో 128 పరుగులు జోడించి.. పటీదార్ నిర్ణయం తప్పు అని నిరూపించారు. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ ఆర్సీబీతో మాత్రం సత్తాచాటాడు.

హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌల ర్లను ఎదుర్కొని సమర్థవంతంగా పరుగులు రాబట్టాడు. చిన్నస్వామిలో ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్నొన్న సాయి శతకంతో మెరిశాడు. మరో ఎండ్‌లో గిల్ సైతం దంచేయ గా.. 10 ఓవర్లకే గుజరాత్ స్కోర్ వంద దా టింది. చివరికి 128 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి సుయాష్ శర్మ తెరదించాడు. మరోవైపు సాయి సుదర్శన్ 58 బం తుల్లో 100 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 5 సిక్స్‌లు, 11 ఫోర్లు కొట్టాడు.

కాగా ఐపీఎల్‌లో సాయి సుదర్శన్‌కు ఇది మూడో సెంచరీ. 2024, 2025, 2026 ఇ లా వరుసగా మూడు సీజన్లలో శతకాలు కొట్టాడు. చివరి ఓవర్లలో వా షింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్ పరుగులు చేయడానికి కొంత తడబడినట్లు అనిపించినా.. కృనాల్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో జేసన్ హోల్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 18 పరుగులు పిండుకోవడంతో గుజరాత్ స్కోరు 200 మార్కును దాటింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లు పరుగులను నియంత్రించడంలో ఘో రంగా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, సుయాష్ శర్మ తల ఒక వికెట్ తీసుకోగా. మిగతా బౌల ర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో జి.టి 3 వికెట్ల నష్టానికి 205 పరుగు లు చేసింది. చేజింగ్‌లో రా యల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చెలరేగిపోయింది. ఫ్లాట్ వికెట్ కావడంతో బౌండ రీల వర్షం కురిసింది.

బేతెల్ (14) రన్స్ కే ఔట్ అయినా విరాట్ కోహ్లీ, పడిక్కల్ విధ్వంసం సృష్టించారు. గుజ రాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 59 బం తుల్లోనే 115 పరుగులు జోడించారు. ఆర్సీ బీ 13 ఓవర్లకే 141 పరుగులు చేసింది. కోహ్లీ కూ డా క్లాసిక్ బ్యాటింగ్‌లో అదరగొట్టేశాడు. కేవలం 44 బం తుల్లో నే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

సెంచరీ చేసేలా కనిపించినా ధాటి గా ఆడే క్రమం లో వెనుదిరిగాడు. పడిక్కల్ సిక్సర్ల వ ర్షం కురిపించాడు. కేవలం 27 బంతుల్లోనే 55 రన్స్ చేశాడు. అయితే చివర్లో ఆర్సీబీ వ రుసగా వికెట్లు కోల్పోయింది. మ్యా చ్‌ను ముగించే హడావుడిలో అనవసరం గా వికెట్లు పారేసు కున్నారు. అయి తే టిమ్ డేవిడ్, కృనాల్ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. దీంతో ఆర్సీబీ 18.5 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది.