13 April, 2026 | 4:06 AM

మెరిసిన కోహెడ విద్యార్థులు

13-04-2026 12:43 AM

కోహెడ, ఏప్రిల్ 12: ఇంటర్ ఫలితాలలో కోహెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ప్రథమ సంవత్సరంలో 68.5 శాతం, అలాగే ద్వితీయ సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఇట్టవేణి ప్రదీప్ కుమార్ సిఇసి గ్రూప్ లో 500 కు గాను 490 మార్కులు సాధించాడు. ఎంపీసీలో యు. అభిరామ్ 470 కి 426 మార్కులు సాధించాడు. బైపిసి గ్రూపులో ఎండి షిరిన్ 418/440, ఎండి తాజ్మీన్ 416/440 సాధించారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ లో టి.సాయి సింధు 941/1000 మార్కులు, తాళ్లపల్లి లక్ష్మీప్రసన్న 939/1000 మార్కులు, వెల్దండ శిరీష 951/1000 మార్కులు, సీఈసీ లో డీ.ప్రణీత్ 648/1000 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కలకోండ రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు  కోతి యాదగిరి, రాజమౌళి, రాజేశ్వర్ రెడ్డి, సీతారామయ్య, నరేష్, అశోక్ పాల్గొన్నారు.