2 June, 2026 | 3:24 PM

పవన్ కళ్యాణ్‌పై కోదండరాం ఆగ్రహం

02-06-2026 02:10 PM

హైదరాబాద్: తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ఉందని తెలంగాణలో మీటింగ్ పెడతామంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బావ ప్రకటనా స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు మీరు రావచ్చు, పోవచ్చు అని కోదండరాం సూచించారు. తెలంగాణ సెక్రటేరియేట్(Telangana Secretariat)లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందని తెలిపారు. ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. త్వరలోనే ఉద్యమకారులను గుర్తిస్తామన్నారు.