స్టీల్ ప్లాంట్ ఘటనపై కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 విభాగంలో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్న ఆయన, మరణించిన వారి కుటుం బాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్లాంట్ లోపల చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలను యుద్ధప్రాతిపది కన వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులకు అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించాలని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.






