22 April, 2026 | 5:09 PM

ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం.. తంగళ్ళపల్లిలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం

22-04-2026 03:48 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి  మండలంలో  బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండలంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... దేశ ప్రధానిపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ కసుగంటి రాజు, బీజేపీ జనరల్ సెక్రటరీ కోస్ని వినయ్, ఉపాధ్యక్షులు అంచ శ్రీనివాస్, జిందం సంతోష్, కనకాల రమేష్, గుర్రం మహేందర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.