సారంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
22-04-2026 03:45 PM
– రైతులకు నేరుగా అమ్మకాలపై అవగాహన
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు తమ వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు.
దళారులను ఆశ్రయించడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు సరైన మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.






