ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు
22-04-2026 03:52 PM
లక్ష్మణ చందా,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఉద్యోగుల సంక్షేమం కోసం వారు చేస్తున్న సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మాత్రమే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అబ్దుల్ సాదిక్ వసంతరావు ఉన్నారు






