16 August, 2026 | 12:52 PM

టేకులపల్లిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

16-08-2026 12:04 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన ఎత్తుకుని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. గ్రామ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.