ఖానాపూర్ మున్సిపల్ మొదటి సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా
22-04-2026 08:41 PM
మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన అనంతరం మొదటి సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాకపోవడంతో గౌరవార్థం మొదటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు తదుపరి తేది మళ్లీ ప్రకటిస్తామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ షోయబ్, కమిషనర్ సుందర్ సింగ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






