2 June, 2026 | 5:21 PM

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

02-06-2026 04:26 PM

* సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలం కుమ్మరితాండాలో ఐదు ఇందిరమ్మ ఇళ్ళును నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. మంగళవారం కుమ్మరి తండాలో  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వెళ్లి  ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. లబ్ధిదారు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కుమ్మరితాండ నాయక్ రంజిత్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు వారిని పరామర్శించారు.