17 April, 2026 | 3:10 AM

ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్

17-04-2026 01:03 AM

చెన్నై, ఏప్రిల్ 16: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. కోల్‌కతా ఇ న్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న సమయంలో ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు.

ఓవర్ చివరి బంతి వేయడానికి రన్-అప్ తీసుకుంటున్న సమయంలో ఖలీల్ కుడి తొడ భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో మధ్యలోనే ఆగిపోయాడు.నొప్పితో విలవిలలాడిన ఖలీల్ అహ్మద్.. మెడికల్ టీమ్ సహా యంతో మై దానాన్ని వీడాడు. ఆ ఓవర్లో మిగిలిన ఒక్క బంతిని గుర్జప్నీత్ సింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ గాయం నుండి కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుందని.. ఈ నేపథ్యంలో ఖలీల్ అహ్మద్ ఐపీఎల్ మిగిలిన   అందుబాటులో ఉండడని వైద్య బృందం స్పష్టం చేసింది.