10 July, 2026 | 7:51 PM

Breaking News

13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •  

కేరళ వాసికి దుబాయ్‌లో జాక్‌పాట్

07-11-2025 12:00 AM

బిగ్ టికెట్ ఈ డ్రాలో వరించిన పావుకిలో బంగారు

దుబాయ్, నవంబర్ 6: దుబాయ్‌లో ఓ ప్రవాస బారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. బిగ్ టికెట్ ఈ డ్రాలో పావుకిలో (25 తులాలు) బంగారాన్ని గెలుచుకున్నారు. కేరళకు చెందిన నితిన్ కున్నత్‌రాజ్ ఉపాధి రీత్యా 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయన తన స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు తాజాగా జాక్‌పాట్ తగిలింది. ఈ విషయాన్ని కున్నత్‌కు షో నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పగా మొదట ఆయన నమ్మలేదు.

తర్వాత టికెట్ నంబర్ 351853తో సహా చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ టికెట్‌పై ఆయన 24 క్యారెట్ల గోల్డ్ బార్ గల 250 గ్రాముల బంగారాన్ని గెలుచుకున్నారు. ఈ 25 తులాల పసిడి విలువ భారతదేశంలో దాదాపు రూ.30 లక్ష ల వరకు ఉంటుంది. వేర్వేరు పేర్ల మీద 10 మంది స్నేహితులతో కలిసి దీనిని కొన్నాని, వారితో ఈ మొత్తాన్ని పంచుకుంటానని కున్న త్ తెలిపారు. ఇలా ‘నాకు అదృష్టం వరించడం ఇదే తొలిసారి’అని సంతోషం వ్యక్తం చేశారు.