తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) 'శ్రీ పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు(Ugadi wishes) తెలిపారు. వ్యవసాయ పనులను నూతనంగా పునఃప్రారంభం చేసుకునే 'రైతు నామ' సంవత్సరంగా ఉగాది పండుగ ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రకృతి మాత శిశిరాన్ని వీడి, కొత్త చిగురులతో వసంతాన్ని ఆహ్వానిస్తూ, నూతన ఆశలకు, సంకల్పాలకు నాంది పలుకుతుందని, ఉగాది నుండి కాలచక్రం పునరావృతమౌతుందని కేసీఆర్ సూచించారు.
ద్వేష భావనలు, అహంకారం తదితర చెడు లక్షణాలు పరాభవం చెంది, వాటి స్థానంలో ఉన్నతమైన ఆశయాలు వృద్ధి చెంది, మనిషి సమున్నతమైన మార్గాన్ని అనుసరించాలనే తాత్వికతను 'శ్రీ పరాభవ' నామ సంవత్సర ఉగాది మనకు తెలియజేస్తుందని కేసీఆర్(KCR) వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు పరాభవం చెంది, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండి, రాష్ట్రం పునర్వైభవం సాధించి విజయం వైపు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.




