calender_icon.png 18 February, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో

18-02-2026 01:50:29 AM

  1. కేసీఆర్‌ను జాతిపిత అన్నది ప్రజలే..
    1. తెలంగాణే కేసీఆర్ ఆనవాళ్లు.. ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి!
    2. తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయడమే కేసీఆర్‌కిచ్చే గిఫ్ట్
    3. సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే వారికెట్ల తెలుస్తది జాతి.. నీతి?
    4. మాది ఫైటర్ల జాతి.. మీది ట్రెయిటర్ల జాతి
    5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
    6. తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ అధినేత జన్మదిన వేడుకలు

* రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది.. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది, కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది, భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది, బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి జాతి మాది.              

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : ‘సర్వసాధారణంగా ఏ తండ్రి అయి నా ఆ కొడుకుకు, ఆ పిల్లలకు హీరోగా ఉంటారని, కానీ నా తండ్రి తెలంగాణ జాతి మొత్తానికి హీరో’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కొంతమంది కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర మే కేసీఆర్ ఆనవాళ్లు అని ఆయన స్పష్టం చేశారు. ‘దాన్ని ఎట్లా చెరిపేస్తావురా సన్నా సి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్త వం-. కేసీఆర్ ఒక శిఖరం, నువ్వు ఒక శునకం.

నీ స్థాయి గదే, నీ బతుకు గదే’ అని మండిపడ్డారు. ఈ విషయం తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ తెలుసన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవంతో తమ యాసలో, తమ భాషలో.. బ్రహ్మాండంగా తమ వనరులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోయే ఒక అవకాశాన్ని, స్వేచ్ఛా వాయువు లు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానాయకుడి జన్మదినం సందర్భంగా..రాష్ట్రవ్యా ప్తంగా సంబురాలు చేస్తున్న మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు, మా అన్నలకు అందరికీ ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నా రు.

ఐకమత్యంగా, కలిసికట్టుగా కదం తొక్కుదామని, మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరేయడమే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరుకానుక అని, కేసీఆర్ లాంటి మహానాయకుడికి పుట్టిన రోజు మనం ఇచ్చే బహు మతి అదేనని పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ కోసం జెండా ఎత్తినప్పటి పరిస్ధితులును గుర్తు చేసుకుంటే ఆయన సాహ సం, చరిత్ర తెలుస్తది అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు రాష్ర్టంలో టీడీపీ, మరొక వైపు నూ రేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీ వంటి --మూడు బలమైన రాజకీయ శక్తులను ఢీ కొనడం దుస్సాహసమనే చెప్పాలన్నారు.

‘మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు.. ఆనాడు ఉన్నదల్లా తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సం కల్పం, ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యా యం, ధర్మం మాత్రమే’నని చెప్పారు. ---ఇవి మాత్రమే కేసీఆర్‌ను మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించాయని గుర్తు చేశారు. 

వారికెట్ల తెలుస్తది జాతి.. నీతి... 

సుదీర్ఘ పోరాటం తర్వాత పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపిన నాయకుడు కేసీఆర్.. తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ ఢిల్లీలో ‘జనరల్‌గా నాయకులు అయితే బెస్ట్ అజిటేటర్స్ (ఉద్యమకారులు) ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ (పరిపాలకులు) ఉంటారు.

కానీ మీరు అదృష్టవంతులు అ య్యా, బెస్ట్ అజిటేటర్ కూడా కేసీఆరే, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆరే. అది అదృష్టం’ అని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మన నా యకుడిని తూలనాడుతున్నారని, జాతి మీ ద, జాతి గౌరవం మీద ఎవరుపడితే వాళ్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందని స్పష్టం చేశారు.

సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణా లకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదని ఆయన మండిపడ్డారు. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుపడి నిలబడ్డోళ్లకు జాతి అంటే ఏంటి, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుస్తదని స్పష్టం చేశారు.

ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తదని ప్రశ్నించారు. రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్‌ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉం టే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అం టే ఏందో తెలుస్తదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్‌కు తెలంగాణ సోయి లేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలవదని స్పష్టం చేశారు. 

స్వతంత్రుల జాతి మాది..

జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్న అల్పులకు ఒక్కటే చెబుతున్నామని, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది, జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది, కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది, భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది,

బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి జాతి మాది,

1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ అని నెత్తుటి త్యాగాలు చేసి న విద్యార్థి అమరవీరుల జాతి మాది, 69లో కర్కశ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది, మలిదశ ఉద్యమంలో ఢి ల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది, అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది అని స్పష్టం చేశారు. కానీ వాడి కేం తెలుస్తది మన జాతి గురించి.. వాడిలా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మే ము కాదన్నారు. తమది సామంతుల జాతి కాదని, స్వతంత్రుల జాతి అని కేటీఆర్ చెప్పారు. 

మాది ఫైటర్ల జాతి.. మీది ట్రెయిటర్ల జాతి..

బానిస జాతి కాదు, గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది, ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది, అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది, తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది అని ఆయన అన్నారు. కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాది తెలిపారు. ‘ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?’ అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా.. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయని, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి అన్నారు.

మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి---గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. జాతి పితనని కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదని, ప్రజలే అలా పిలుచుకున్నారని స్పష్టం చేశారు. ఎవరైతే స్వాతంత్య్రం తెచ్చిండో తమ జాతికి, ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని, పెద్దమనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్దమనిషి కాబట్టే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నామన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కేటీఆర్ కోరారు. 

గులాబీ నేతకు నీరాజనాలు

  1. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
  2. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు 
  3. జనసంద్రంగా ఫామ్‌హౌస్ పరిసరాలు 
  4. దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిన కార్లు.. ట్రాఫిక్ జామ్ 
  5. ప్రతిఒక్కరితో ఓపికగా ఫొటో దిగిన కేసీఆర్.