3 June, 2026 | 2:40 AM

కేసీఆర్ ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించారు

03-06-2026 01:46 AM

ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్ పల్లి, జూన్2,( విజయ క్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రాన్ని సాధించారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కెపిహెచ్బి కాలనీ మొదటి రోడ్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితమన్నారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పగుడాల శిరీష బాబురావు, నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్ గౌడ్, సురేష్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

 ఎమ్మెల్యే కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు జూపల్లి సత్యనారాయణ, పగుడాల బాబురావు, నాయకులు అంబటి శ్రీనివాస్, సంతోష్, చిన్న తులసి, ప్రభాకర్, చైతన్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.