25 February, 2026 | 7:49 PM

బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందం

25-02-2026 05:46 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బుధవారం కాయకల్ప బృందం జహీరాబాద్ హాస్పిటల్ వైద్యులు సందర్శించడం జరిగింది. హాస్పిటల్ యొక్క పరిశుభ్రత, హాస్పటల్ యొక్క నిర్వహణ పేషంట్ అందుతున్న వైద్యం వివరాలను తెలుసుకోవడం జరిగింది. భోజనం  సదుపాయాలు హాస్పిటల్ యొక్క పరిశుభ్రత హాస్పిటల్ లో అందుతున్న సేవలు పేషెంట్ కు అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా హాస్పిటల్ లో అందుతున్న మందుల వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి సుధీర్ కుమార్ సూపర్డెంట్ జహీరాబాద్ ఏరియా హాస్పిటల్  ఎం.మానస ఆర్ఎంఓ బి.సునంద నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్ 2 మంజుల స్టాఫ్ నర్స్, ఏరియా హాస్పిటల్, బాన్సువాడ సూపర్డెంట్ డాక్టర్ విజయ భాస్కర్, ఆర్ఎంఓ సుజాత నర్సింగ్, సూపర్డెంట్ ఆరోగ్య జ్యోతి సుబ్బయమ్మ,  శాంత కుమారి, అమృత జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.