మౌనప్రదర్శనల హోరు
ఆర్టీసీ సమ్మె 3
దద్దరిల్లిన ఆర్టీసీ డిపోలు
- మూడో రోజూ కొనసాగిన సమ్మె
- డిపోల ఎదుట డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు కార్మికుల నివాళి
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): మూడోరోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యా యి. డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతితో ఆర్టీసీ డిపోలన్నీ నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లాయి, మౌన ప్రదర్శనల హోరు కొనసాగింది. డిపోల ముందు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి కార్మికులు నివాళులర్పించారు. ప్రభుత్వాని కి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం మౌన ప్రదర్శన చేపడుతూ ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాల్సిందేనని కార్మికులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి న తర్వా త ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాటవేయడం సరికాదన్నారు. మరోవైపు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో నర్సంపేటలో టెన్షన్ వాతావరణం చోటు చేసు కుం ది. నివాళులర్పించేందుకు వెళ్లిన వివిధ పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు మానవహారం నిర్వహించారు. కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు... బీజేపీ నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంఘీభావం తెలిపారు. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క డ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా శాంతియుతంగా సమ్మెను కొనసాగించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ కార్మికులను కోరారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎ స్, జేబీఎస్ బస్టాండ్ల వద్ద కూడా కార్మికులు శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి నిరసన చేపట్టారు. ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళ చేపట్టారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టారు.
రాష్ట్రమంతా ఆందోళనలు..
హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలే తప్ప, ఆత్మబలిదానాలకు ఎవ రూ ఒడిగట్టవద్దని పలుపార్టీలకు చెందిన నాయకులు పేర్కొన్నారు. శంకర్‌గౌడ్ మృతికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు నివాళులర్పించారు. ఆత్మహత్యలొద్దు, తెగిం చి పోరాడుదామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఆర్టీసీ డీపోవద్ద నిర్వహించిన కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిం చారు. ఆర్టీసీ కార్మికులతో తగవు పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదన్నారు.
మొండివైఖరితో ఎమర్జెన్సీ పరిస్థితులను తీసుకొస్తున్నా రని, శంకర్‌గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూనంనేని డిమాండ్ చేశారు. ఖమ్మం డీపో ఎదుట పెద్ద ఎత్తున కార్మికులు మానవహారం, మౌనప్రదర్శనలు నిర్వహించారు. హనుమకొండలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌గౌడ్ మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కా మారెడ్డిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాం డ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ ఆందోళనల కు బీజేపీ, టీఆ ర్పీ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజీనామా చేయాలని కార్మికులు, టీఆర్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం డిపో బయట కార్మికులు మానవహారం, మౌనప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనకు అన్ని పార్టీల నాయకు లు తమ మద్దతు ప్రకటించారు. సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మౌన ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు.
శంక ర్‌గౌడ్ మృతికి నివాళులర్పించి ఆయా డిపో ల వద్ద ఆందోళనలు కొనసాగించారు. నిర్మల్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు శాంతిర్యాలీని నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికు లు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. నాగర్‌కర్నూల్ డిపో ఎదు ట కార్మికుల నిరసన దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రభు త్వ వైఖరిని నిరసించారు. శంకర్‌గౌడ్ మృతికి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






