దృఢమైన యువతే వికసిత్ భారత్‌కు బలం
- క్రీడలు ఆడేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- క్రీడాకారులకు పేదరికం అడ్డు కాకూడదు
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
- దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : దృఢమైన యువత వికసిత్ భారత్‌కు బలమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా స్టేడియం మైదానంలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్ర ధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్2026 కా ర్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
ఈ సంద ర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ యువతే బలమైన, ప్రగతిశీల దేశ నిర్మాణానికి నిజమైన శక్తి అ న్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, టీమ్ స్ఫూర్తినీ పెంపొందించడానికి, ఓర్పు, క్రమశిక్షణను అభివృద్ధి చేయడానికి కీలకమన్నారు. ఖేలో ఇండి యా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించడంలో ముఖ్య పాత్ర పో షిస్తున్నాయని గవర్నర్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతలో క్రీడలు కేవలం పతకాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి, జాతీయ ఐక్యతకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమా న్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, యువ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
యువత క్రీడారంగంలో రాణించాలి : మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
పేదరికం ఎట్టి పరిస్థితుల్లో క్రీడాకారులకు అడ్డు కాకూడదని మహబూబ్ నగర్ ఎంపీడీకే అరుణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడారంగంలో ప్రోత్సహించి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు సంస ద్ ఖేల్ మహోత్సవ్ ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫం డ్స్, పెన్షన్‌ల ద్వారా ప్రోత్సహిస్తుందని గుర్తు చేశా రు.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన 15 ఏళ్ల కాలంలో క్రీడారంగంలో అనేక అంతర్జాతీయ వేదికల పై పతకాలు సాధించారని, ఇది ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న స్పూర్తికి నిదర్శనమని ఎంపీ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో గ్రామ, మండల స్థాయిలలో కూడా మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తానని, క్రీడారంగంలో ఆస క్తి కలిగిన క్రీడాకారులను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చొరవ చూపుతూ ప్రోత్సాహకం అందిస్తామన్నారు.
ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన మెయిల్, అరబిందో, హేటిరో, ఎం ఎస్‌ఎన్, నాట్కో, సూర్య చంద్ర ఫౌండేషన్ లకు ధన్యవాదాలు తెలిపా రు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లా డారు.
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,ప్రధాన మంత్రి సం సద్ ఖేల్ మహోత్సవ్ పార్లమెంట్ ఇన్‌చార్జి జనార్థన్ రెడ్డి, నగర మేయర్ మమత, డిప్యూటీ మేయ ర్ సురేందర్‌రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మ ల్లు నర్సింహ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, గోంగిడి త్రిష రెడ్డి, మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెటర్ త్రిష పూజిత ప్రజాప్రతినిధులు, క్రీడాకారు లు, నిర్వాహకులున్నారు.అంతకుముందు గవర్న ర్‌కు ఎంపీ డీకే అరుణ,జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
క్రీడలతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు
దేశ భవిష్యత్తును నిర్మించే యువత శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని, స్వస్థ భారత్ - ఫిట్ ఇండియా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ వే దికగా యువ క్రీడాకారుల ఉత్సాహం మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సం తోషంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతలో భాగంగా 2020లో తీ సుకువచ్చిన నూతన విద్యా, క్రీడా విధానాలు నేడు దేశవ్యాప్తంగా అద్భుత ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తిస్తూ, విద్యార్థులను క్రీడల వైపు మళ్లించడం అభినందనీయమన్నారు. ‘నశా ముక్త్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలను సా ధించడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఉద్ఘాటించారు.సంపూర్ణ ఆరోగ్యంతోనే దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉం టాయని క్రీడల్లో ప్రతి ఒక్కరు రాణించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.






