25 April, 2026 | 3:28 AM

అందాల భామల ఈవెంట్లకు వందల కోట్లు.. కార్మికుల కోసం డబ్బులు లేవా..?

25-04-2026 02:10 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు ప్రకటించిన సభకు మద్దతుగా జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ఆర్టీసీ కార్మికులు కోరుకున్న విధంగానే ప్రభుత్వం ఏర్పడిందని చాలామంది ఆనాడు సంతోషపడ్డారు. గత 10 ఏళ్లగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రావాలని ప్రతి ప్రయాణికుడికి తెలియజేశారని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి పిఆర్సిగా 44 శాతం ఇచ్చారు. పోలీసు సిబ్బంది పైన ప్రభుత్వం ఎందుకు కనికరం చూపడం లేదని ప్రశ్నించారు. ఎండలో నిలబడి డ్యూటీ చేస్తున్న కార్మికులపై కనీస మానవత్వం లేదని విమర్శించారు. పెట్రోల్ పోసుకుని నిప్పు పట్టించుకున్న సంఘటన ప్రతి కార్మికుడి గుండెను కదిలించిందన్నారు.

మహాలక్ష్మి పథకం పేరుతో పని భారం పెరిగి ఎనిమిది గంటల పని 16 గంటలు అయింది. గత ప్రభుత్వం చేసిన విలిన తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బి ఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.