1 June, 2026 | 2:20 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

ఏపీ నాయకులపై కవిత సంచలన వ్యాఖ్యలు.. TRS 2.0తో పెట్టుకుంటే..!

01-06-2026 01:16 PM

హైదరాబాద్: ఏపీ నేతలపై తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన" రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత(Kalvakuntla Kavitha) మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు ప్రజల మధ్య చిచ్చులు పెడితే చూస్తూ TRS పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ''టీఆర్ఎస్ జెండా(TRS Flag) రాకముందు లెక్క వేరే.. ఇప్పుడు లెక్క వేరే, టీఆర్ఎస్ పెట్టుకుంటే మంచిగుండదు. టీఆర్ఎస్ 2.0 తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయన్నారు.


13 ఏళ్లయినా ఆంధ్రప్రదేశ్ లో కనీసం రాజధాని కట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో విస్తరిస్తామని మంత్రి లోకేష్ అంటున్నారు, ఇదేమీ సామ్రాజ్యం కాదని కవిత మండిపడ్డారు. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో పవన్ కళ్యాణ్ సభ పెడతారట, ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదన్నారు. వర్షాకాలంలో సచివాలయంలోకి నీరు రాకుండా పవన్, లోకేష్ చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏపీ ఏజెంట్, అందుకే ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలు అన్నీ కూలగొడతామని హెచ్చరించారు. ఆంధ్రా వాళ్లు ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చన్న కవిత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆంధ్రావాళ్లంతా మా వారే అన్నారు. ఆంధ్రావాళ్లను 12 ఏళ్లు కడుపున పెట్టి కాపాడుకున్నామన్నారు. ఇకపై కూడా హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లను కాపాడుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఏపీ నేతలు మా సచివాలయంలో గరిటె తిప్పతామంటే కుదరదని చురకలంటించారు.