31 July, 2026 | 10:11 AM

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక! రెడ్ అలర్ట్ జారీ

31-07-2026 09:31 AM

హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు(Telangana Rains) కురుస్తున్నాయి. ఇవాళ పలు చోట్ల భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Alert), నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department) ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఉత్తర తెలంగాణలో కుంభవృష్టితో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదిలాబాద్ ఏజెన్సీలో 16 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

మందమర్రిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) పర్యటించారు. భారీ వర్షాలతో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరుణుడి కరుణతో రైతులు వ్యవసాయ పనుల్లోకి దిగారు. మూడు రోజులుగా కురుస్తున్న వార్షాలతో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. కృష్ణా, గోదావరి నదుల్లోకి  ఎగువ నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుంది. శ్రీశైలం సహా అన్ని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. భద్రచలం వద్ద గోదావరి నది పర వళ్లు తొక్కుతుంది. గోదావరి, కృష్ణా పరివాహక జలాశయాల్లో జలసవ్వడి నెలకొంది. కడెం ప్రాజెక్టు వరద గేట్ల నుంచి వరద నీరు ఎగిసిపడుతోంది. భద్రాచలం వద్ద అంతకంతకూ వరద నీరు పెరుగుతోంది. జూరాల గేట్ల నుంచి కృష్ణా నదిలోకి పెద్ద ఎత్తున వరద పారుతోంది. శ్రీరామ్ సాగర్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కడెం ప్రాజెక్టు ఉద్ధృతితో ఎల్లంపల్లి గేట్లు తెరుచుకున్నాయి. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డకు 4 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరిలో ప్రవాహాలు పెరిగాయి.

గత 24 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు 

గత 24 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా, మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో అత్యధికంగా 163.8 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని పశ్చిమ, మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇందులో షేక్‌పేటలో 14.5 మి.మీ వర్షపాతం నమోదైంది.