31 July, 2026 | 10:25 AM

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం

31-07-2026 09:48 AM

హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి(Peddi Sudarshan Reddy death) పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో(Telangana Movement) పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు,  శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12:50 గంటలకు BRS నాయకుడు, మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Former Narsampet MLA Peddi Sudarshan Reddy) కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. జూలై 26వ తేదీ ఉదయం సుదర్శన్ రెడ్డి తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడటంతో, అతడిని హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడికి గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. వైద్య బృందాలు దాదాపు గంటసేపు తొమ్మిది సార్లు సీపీఆర్ చేసిన తర్వాత కొంత గుండె స్పందనను పునరుద్ధరించాయి. మెరుగైన చికిత్స కోసం అతడిని తర్వాత సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.