31 July, 2026 | 11:17 AM

నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్

31-07-2026 10:23 AM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నాంపల్లి ఏసీబీ కోర్టుకు(Nampally ACB Court) హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినఫార్ములా ఈ -కార్ రేసు కేసులో(Formula-E race case) కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఫార్మూలా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ-3గా మాజీ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.

కోర్టు సమన్లతో నిందితులు మొదటి సారి విచారణకు హాజరయ్యారు. ఈ-కార్ రేసుకు  రూ. 55 కోట్లకు పైగా హెచ్ ఎండీఏ నిధులు(HMDA funds) ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. రికార్డులు లేకుండా ఆడిట్ ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ ఆరోపించింది. ఆర్ బీఐ, పన్ను నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థలకు బదిలీ చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. పన్నుల రూపంలో ప్రభుత్వం రూ. 8.06 కోట్ల అదనపు భారం పడిందని ఏసీబీ వెల్లడించింది. నిందితులు ఇవాళ నాంపల్లి కోర్టులో పూచీకత్తులు సమర్పించనున్నారు.