వర్షాకాలం సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. వాతావరణ శాఖ అధికారులు నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
సాగునీటి ప్రాజెక్టుల(Irrigation Projects) మెయింటెనెన్స్ పనులపై సీఎం ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిన వంతెనల నిర్మాణానికి తక్షణమే నిధులు ఇవ్వాలని సూచించారు. విపత్తుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరిగితే వెంటనే స్పందించాలని ఆదేశించారు.






