13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

కవిత రాజీనామా ఆమోదం

07-01-2026 01:22 AM

హైదరాబాద్, జనవరి 6(విజయక్రాంతి): కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. ఆమె రాజీనామాను కొద్దిసేపటి క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కవితను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి కవిత రాజీనామా పెండింగ్‌లో ఉంది.

సోమవారం కవిత మండలికి హాజరై తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో ఆమె రాజీనా మాను మండలి చైర్మన్ ఆమోదించారు. కాగా కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా కవిత రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ అయింది.