1 July, 2026 | 10:14 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు

13-02-2026 12:00 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డా.చీమ శ్రీనివాస్

ముషీరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం(టీయూఎఫ్) ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఫోరంలోకి కంచర్ల మంజూష, సింగరాజు శ్యామల, నిట్ట పద్మ, సలీం అస్లామ్, వేణు గోపాల్, ప్రమోద్ తదితరులు హజరయ్యారు.

అనంత రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్లు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారుల ఆత్మ గౌర వం దెబ్బ తీసిన కవిత నేడు తెలంగాణ ఉద్య మకారుల ఆత్మ గౌరవ సభ పెట్టడం విడ్డూరం గా ఉందన్నారు.

గత పదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఉద్యమ కారుల గురించి మాట్లాడలేదని, అంత ప్రేమే ఉంటే తన ఆస్తిలో 10 శాతం ఉద్యమకారుల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ స్వామి, దయానంద్, నాగజ్యోతి, జగన్ యాదవ్, రాజేందర్, శివ కుమార్ నేత, రోజా నేత, ఆర్.కే. భూపాల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.