1 July, 2026 | 9:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నరకప్రాయంగా చెరువుకట్ట దారి

13-02-2026 12:00 AM

రేవల్లి ఫిబ్రవరి 12: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో వడ్దేగేరి ప్రాంతానికి వె ళ్లే చెరువు కట్ట రహదారి ప్రస్తుతం మృత్యుపాశంగా మారింది. చెరువు కట్టపై వేసిన సిమెంట్ రోడ్డు భారీ పగుళ్లతో విడిపోయి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్డుకు ఆనుకుని లోతైన చెరువు ఉ న్నప్పటికీ, కనీసం రక్షణ సూచనలు లేకపోవడం గమనార్హం. రాత్రి వేళల్లో ఈ పగుళ్లు కనిపించక వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏమాత్రం అదు పు తప్పినా వాహనాలు నేరుగా చెరువులోకి వెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఏదైనా ప్రాణనష్టం జరగకముందే రోడ్డుపై తగిన చర్యలు తీసుకోవా లని వడ్దేగేరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.