30 June, 2026 | 8:29 PM

Breaking News

కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •   జమలాపురం శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు   •   కామారెడ్డిలో గంజాయి పట్టివేత   •  

బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడిగా కస్తూరి లక్ష్మీ నారాయణ

21-03-2026 01:13 AM

కోరుట్ల మార్చి 20 (విజయక్రాంతి): కోరుట్ల పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గ నాయకుడు డాక్టర్ వై అనూప్ రావు నివాసంలో నిర్వహించిన సమావేశంలో కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా 11వ వార్డ్ కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీ నారాయణ ని జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు డాక్టర్ వై అనూప్ రావు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్  లక్ష్మీనారాయణకి అధ్యక్షుడి నియామక పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని మున్సిపల్ లో బీజేపీ గొంతు బలంగా వినిపించాలని ఆదేశించారు అనంతరం కస్తూరి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను పట్టణ అధ్యక్షుడిగా నియమించిన ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు డాక్టర్ వై అనూప్ రావు రుద్ర శ్రీనివాస్  లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కోరుట్ల పట్టణంలో ప్రతి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని ప్రతి ఒక్క కార్యకర్తని నాయకున్ని కలుపుకొని పని చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ 27 వ వార్డు కౌన్సిలర్ తిరుమల వాసు మెట్పల్లి పట్టణ 26 వార్డు కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్  బీజేపీ బీజేవైఎం వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు