1 September, 2026 | 12:30 AM

ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజం : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

31-08-2026 10:35 PM

ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు అధికారులను సత్కరించిన ఎస్పీ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న పోలీసు అధికారులును ఎస్పీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసి వీడ్కోలు పలికారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఎస్. ఈశ్వరయ్య, ఎస్సై 2, చిట్యాల పోలీస్ స్టేషన్, ఎన్ సత్యనారాయణ రావు, ఎస్సై 2, ఘణపురం పోలీస్ స్టేషన్, పి రవికుమార్, ఏఆర్‌ఎస్ఐ, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, భూపాలపల్లి, సీహెచ్ కుమారస్వామి ఏఎస్ఐ, ఎస్ బి భూపాలపల్లి, పి అశోక్, హెడ్ కానిస్టేబుల్, పీసీఆర్, భూపాలపల్లి ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్  మాట్లాడుతూ ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగి విజయవంతంగా విధులు నిర్వర్తించడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ రత్నం, భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, పోలీసు సంఘం అధ్యక్షుడు నరేష్‌, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.