31 August, 2026 | 11:43 PM

మహాదేవపూర్ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

31-08-2026 10:42 PM

ఆలేరు,(విజయక్రాంతి): బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మహాదేవపూర్‌లోని పురాతన ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.