calender_icon.png 4 February, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరిలో మిగిలింది వీరే..

04-02-2026 01:58:13 AM

రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు

రసవత్తరంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికలు

కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించిన ఆశావాహుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలామంది రెబల్ అభ్యర్థులు వివిధ పార్టీల గుర్తులపై, కొందరు స్వతంత్రంగా బరిలో నిలవడంతో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లకుగాను 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి 66 చొప్పున, కాంగ్రెస్ నుంచి సీపీఐ మిత్ర పక్షానికి ఒకటి పోనూ 65 స్థానాల్లో బరిలో ఉన్నారు. జమ్మికుంటలో మొత్తం 30 వార్డులు ఉండగా 159 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

ఇందులో బీజేపీ నుంచి 30, కాంగ్రెస్ నుంచి 30 మంది, బీఆర్‌ఎస్ నుంచి 30 మంది, ఏఐఎఫ్‌బీ నుంచి 13 మంది, జనసేన పార్టీ నుంచి 12 మంది, ఇతర గుర్తింపు పార్టీల నుంచి ఇద్దరు, స్వతంత్రులు 37 మంది బరిలో మిగిలారు. పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా 157 మంది బరిలో మిగిలారు.ఇందులో బీఎస్పీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి 36, సీపీఐ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి 36 మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి 36, జనసేన నుంచి ఆరుగురు, ఏఐఎఫ్బీ నుంచి 23, గుర్తింపు పొందని పార్టీల నుంచి నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు 20 మంది బరిలో మిగిలారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులకుగాను 113 మంది బరిలో మిగిలారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు మొత్తం వార్డుల నుంచి పోటీ చేస్తున్నారు.కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 150 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ 33 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థులు 26 వారుల్లో పోటీ చేస్తున్నారు. సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి 13 మంది, జనసేన నుంచి ఐదుగురు, ఏఐఎఫ్‌బీ నుంచి ఒక్కరు, గుర్తింపు పొందని పార్టీల నుంచి ముగ్గురు, స్వతంత్రులు 32 మంది బరిలో మిగిలారు.