కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతులు
- టెండర్లు లేకుండా తనవారికే కాంట్రాక్టులు
- రియల్ వ్యాపారులకు బెదిరింపులు, వసూళ్లు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కమీషన్ల కోసం కాకుండా చిత్తశు ద్ధితో కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని, కమీషన్ల కోసమే మరమ్మత్తులు చేపడుతున్నట్లుగా తాను భావిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని చెప్పి 8.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వకుండా ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వమన్నారు.
శుక్రవారం బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ప్రయోజనాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీని అవినీతికి కేరాఫ్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టెండర్లు లేకుండానే కాంట్రాక్టులు తనవారికే కట్టబెడుతున్నారని ఆరో పించారు. నామినేషన్ పద్ధతిలో రూ. 1148 కోట్ల కాంట్రాక్టులను ఇచ్చారని చెప్పారు. హైడ్రాపేరుతో రియల్ వ్యా పారుల వద్ద వసూ ళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయన్నారు. బ్లాక్‌మెయిల్ దందా ఆపకుంటే ఈడీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని 2011జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవటం అన్యాయమన్నా రు. డ్రాఫ్ట్ బిల్లును పరిశీలిస్తామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్తామన్నారు. ఎంపీ అర్వింద్ తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
25న జరగ నున్న పార్టీ ఆవిర్భావసభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలను వేశామన్నారు. కమి టీలో 30 మంది సభ్యులు, 500మంది వా లంటీర్లు ఉంటారని, ట్రాఫిక్ సమస్యలు లాంటి ఆటంకాలు లేకుండా సమన్వయం చేసుకుంటారని కల్వకుంట్ల కవిత చెప్పారు.




