calender_icon.png 15 February, 2026 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఝరి గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

14-02-2026 09:50:43 PM

తలమడుగు,(విజయక్రాంతి): మండలంలోని ఝరీ గ్రామ శ్రీ రాజరాజేశ్వరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రినీ పురస్కరించుకొని క్రికెట్, కబడ్డీ పోటీలను నిర్వహించి దాతల సహకారంతో బహుమతులను అందజేస్తున్నామన్నారు.

ఉత్సాహవంతులైన క్రీడాకారులు పోటీలలో పాల్గొని బహుమతులు గేలుసుకోవచ్చని అన్నారు. అలాగే రేపు జరగబోయే రాజరాజేశ్వరీ కళ్యాణం లో శివ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెస్రం రూప కాశీరాం, కబడ్డీ బహుమతి  ప్రదాతలు రాంబాయి, నక్క ధనంజయ్, పునగూడా సర్పంచ్ హనుమంతు, రత్నాపూర్ సర్పంచ్ సూర్య భాను, జైత్ పటేల్, భుజంగ రావు, తదితరులు పాల్గొన్నారు.