21 August, 2026 | 11:51 PM

కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్

21-08-2026 09:23 PM

కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా కోరుట్ల మీదుగా జగిత్యాల వెళ్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ల ఆధ్వర్యంలో  మెట్పల్లి మండలం సంస్థాన్ బండలింగాపూర్ గ్రామంలో గల గండి హనుమాన్ దేవస్థానం వద్ద స్వాగతం పలికి అక్కడినుండి బయలుదేరి కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద గల దివంగత నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ శంకుస్థాపన కోసం జగిత్యాల జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ మెట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.