అర్హులైన పేదలకు న్యాయం జరుగుతుంది
పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి
ఎల్బీనగర్, మే 17 (విజయభాస్కర్‌రెడ్డి): అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని, డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లు కేటాయిస్తానని టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి అన్నారు. ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల పరిధిలోని మంకాల్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు శనివారం మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలోని కేఎల్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో దేపభాస్కర్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభు త్వంలో మంకాల్ -1 పరిధిలో డబుల్ బెడ్రూ మ్ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. హైకోర్టులో కేసు ఉండటంతో ఇప్పటివరకు వీరు ఇళ్లలోకి ప్రవేశించలేదన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 2025లో కోర్టు తుది తీర్పు వెలువరించిందని, అనంతరం అధికారులు చేపట్టిన రీ-ఎంక్వైరీలో మొత్తం లబ్ధిదా రుల నుంచి అర్హులైన 141 మందిని గుర్తిస్తూ కలెక్టర్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు నివేదికలు ఇచ్చారని తెలిపారు.
అన్ని అనుమ తులు ఉన్నప్పటికీ ఇళ్ల కేటాయింపులో ఆల స్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన 141 మంది పేద కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంకాల్- 1 పరిధిలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, స్థానిక కాం గ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






