17 May, 2026 | 3:08 AM

వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలి

17-05-2026 12:58 AM

మంత్రులకు యాదాద్రి పరిరక్షణ కమిటీ వినతి

యాదగిరిగుట్ట, మే 16 (విజయక్రాంతి): యాదాద్రి కొండపైన వర్తక సంఘం రద్దు చేసి టెండర్ వేయాలని కోరుతూ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు వినతి పత్రం అందజేసినట్లు కమిటీ సభ్యులు శనివారం తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ యాదాద్రి కొండపైన వర్తక సంఘం పేరుతో పది దుకాణా లను నిర్వహిస్తున్న షాపులను రద్దుచేసి అదే స్థానంలో షాపులకు టెండర్లు వేస్తే దేవాలయానికి ఆదాయం బాగా పెరుగుతుంద న్నా రు. వర్తక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 10 షాపులకు కోటీ అరవై లక్షలు చెల్లిస్తుండగా, అవేషాపులను టెండర్లు వేస్తే 20 నుంచి 30 కోట్ల ఆదాయం వస్తుందని ఇది దేవాలయానికి, భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బండ రామస్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.